రథసప్తమి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం:- రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం ఎంజీ రోడ్‌లోని గణేష్ టెంపుల్ ఆలయంలో అవుటుపల్లి రాంబాబు గురుస్వామి పుట్టినరోజు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శిష్య బృందం, డోలక్ రంజిత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల కచేరి నిర్వహించారు. కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం గణేష్ టెంపుల్ ఆలయంలో మాఘమాసం మొత్తం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ప్రీతికోసం భక్తులకు గోత్రనామాలతో పూజలు, సూర్య నమస్కార పూజల విధానాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. సూర్య...