మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పరివర్తన అవాజ్:- కొత్తగూడెం కార్పొరేషన్ 14వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం ప్రాంతంలోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అత్యుత్తమ రాజ్యాంగం కలిగిన దేశమని అన్నారు. వివిధ కులాలు, మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలంతా ఒక్కటిగా జీవించేందుకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు గౌరవించాల్సిన గొప్ప గ్రంథమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా...