Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 3:31 pm Posted by : parivarthanaawaaz

బోడు లో ఘనంగా వనదేవతల జాతర.

        బోడు లో ఘనంగా వనదేవతల జాతర.

            సమ్మక్క సారక్క లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు.

టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 29.టేకులపల్లి మండలం బోడు గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గురువారం సారలమ్మ తల్లి బోడు గుట్టపై ఉన్న గద్దెపై కొలువుదీరింది. బోడు చుట్టుపక్కల, గ్రామాలైన ముక్కంపాడు, రామచంద్ర పేట, మురుట్ల , టేకులపల్లి, జంగాలపల్లి గ్రామాల నుండి వనదేవతలైన సమ్మక్క సారమ్మలను గ్రామస్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని,పాడి పంటలను సమృద్ధిగా పండాలని, వనదేవతల దీవెనలు మెండుగా ఉండాలని భక్తులు కోరుకున్నారు.