Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 1:58 pm Posted by : laxman RAO

పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

పరివర్తన అవాజ్ :పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి శనివారం తో పదవీ విరమణ పొందిన ఒక ఏఎస్సై,ఒక ఏఆర్ఎస్సై ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.43 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్సై మంచా నాయక్ ను,41 సంవత్సరాలు తమ సేవలను అందించి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఆర్ఎస్సై సూర్యనారాయణ లు శనివారం పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ ఇద్దరు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.పదవీ విరమణ అనంతరం వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతిఫలాలు త్వరితగతిన అందేలా చూడాలని కార్యాలయ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.