నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్
నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ కామారెడ్డి పరివర్తన ఆవాజ్ జనవరి 30, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఇంచార్జి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గత బుధవారం నుంచి మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని...