తరలివచ్చిన అమ్మ… సమ్మక్కకు ఊరంతా స్వాగతం గరీబ్‌పేటలో ఘనంగా సమ్మక్క–సారలక్కల
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-తెలంగాణ సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలక్కల మహాజాతరను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో గురువారం సమ్మక్క–సారలమ్మల జాతరను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వనం నుంచి జనంలోకి అమ్మవారి ప్రవేశం సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. గరీబ్‌పేటలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలపై సమ్మక్క తల్లి కొలువుదీరగా, ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ రీతుల్లో విశిష్ట పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, వేషధారణ, డోలు మ్రోగింపులతో జాతర మరింత శోభాయమానంగా మారింది. కొండలరావు శాంతాదేవి సాయి...