Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 11:20 am Posted by : laxman RAO

డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తోట దేవిప్రసన్న మర్యాద పూర్వకంగా కలిసిన ఎ.ఐ.సి.సి నేషనల్ కోఆర్డినేటర్

డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తోట దేవిప్రసన్న

మర్యాద పూర్వకంగా కలిసిన ఎ.ఐ.సి.సి నేషనల్ కోఆర్డినేటర్

కొత్తగూడెం జనవరి 11 : కాంగ్రెస్‌ పార్టీ డిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవిప్రసన్నను ఎ.ఐ.సి.సి నేషనల్ కోఆర్డినేటర్ ఎల్.కృష్ణ ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత జిల్లా పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమీకరణ, రాబోయే ఎన్నికల కార్యక్రమాల ప్రణాళిక పై చర్చించారు. ఈ సందర్భంగా దేవిప్రసన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన పై ఉంచిన విశ్వాసానికి పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం కోటి రెడ్డి, ఏనుగుల అర్జున్ రావు, ఎం.డి ఖజా గౌస్ మొయినుద్దీన్, సుజాతనగర్ శేఖర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.