డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్.కె గౌస్ పాషా

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.కె గౌస్ పాషా శుక్రవారం డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 39వ డివిజన్ కార్పొరేటర్‌గా మైనార్టీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని గౌస్ పాషా డిసిసి అధ్యక్షురాలిని కోరారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ, పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న తన సేవలను...