Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 1:51 am Posted by : Sai Krishna

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల

టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్:

 

 టేకులపల్లి:ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి టేకులపల్లి సెంటర్లో అత్యంత వైభవంగా టిడిపి నాయకులు అభిమానులు జరుపుకున్నారు. సీనియర్ నాయకుడు టేకులపల్లి టిడిపి మండల కార్యదర్శి గుడిపూడి మోహన్ రావు నాయకులు అభిమానులతో కలిసి 10 కేజీల భారీ కేకును కట్ చేశారు అందరికీ కేకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. టపాసులు బాణాసంచా కాల్చి జై లోకేష్ జై టిడిపి అంటూ కేరింతల కొడుతూ ఆనందోత్సాహాలతో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలతో టేకులపల్లి సెంటర్ సందడి నెలకొంది.భారీగా అభిమానులు ఈ వేడుకలకు తరలివచ్చారు . ఈ కార్యక్రమంలో గుడిపూడి కృష్ణయ్య,కూచిపూడి నాగయ్య,ఏపూరి సీతయ్య, గజ్జల రామ్ శేఖర్, బొగ్గారపు అజయ్, సామినేని సతీష్, నంబూరి అనిల్, రాయల రాజేష్, మూడ్ కుమార్, నెల్లూరి శ్రీనివాస్, కాగితాల వెంకటరమణాచారి, నల్లమోతు నరేష్, బి. చందు,మూడ్ కృష్ణ, బోడ హిమ సాయి, తోటకూరి సతీష్, కందుల సందీప్, వట్టం నాగేందర్, జోగా సాయి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.