Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 3:25 pm Posted by : parivarthanaawaaz

గుండెపోటుతో బల్లెం బిక్షం మృతి.

           గుండెపోటుతో బల్లెం బిక్షం మృతి.

టేకులపల్లి పరివర్తన అవాజ్  జనవరి 29, టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు బల్లెం బిక్షం (50) హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు. ఉపాధ్యాయుడుగా 15 సంవత్సరాలుగా పనిచేసి అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది అనేక మంది మన్ననలు పొందారు. గత ఐదు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ తరఫున సులానగర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేసారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చురుకుగా పనిచేసి సర్పంచ్ గెలుపు కు బాసటగా నిలిచాడు. బిక్షం మన మధ్య లేరని గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. బిక్షం కు రాజకీయ ప్రముఖులు గ్రామస్తులు భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు