గరీపేటలో ఘనంగా సమ్మక్క–సారలమ్మ జాతర

  పరివర్తన అవాజ్,కొత్తగూడెం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే జాతీయ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పంచాయతీ పరిధిలోని గరీపేట గ్రామంలో జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ జాతర వేడుకలు భక్తుల సందడితో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రధాన సభ్యులు కామిశెట్టి కొండలరావు, శాంతాదేవి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. 28వ తేదీన సారలమ్మ వనం...