Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 12:03 pm Posted by : laxman RAO

క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించడమే కాసానికి నివాళి

 

కాసాని వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

పరివర్తన అవాజ్

క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించడమే కాసానికి ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు.
స్థానిక మంచికంటి భవన్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ జరిగింది.ముందుగా కాసాని చిత్ర పటానికి మచ్చ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాయితీగా చివరి శ్వాస వరకు ఎర్రజెండా నీడలో పని చేసిన కాసాని నేటి తరానికి ఆదర్శమని అన్నారు.అత్యంత నిరాడంబర జీవితం కమ్యూనిస్టు విలువలు పాటించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు కాసాని అని కొనియాడారు. ఇళ్ల స్థలాల పోరాటం ద్వారా పదిహేనువేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన ప్రజా పోరాట యోధుడని అన్నారు. ఈ పోరాటంలో జైలుకి సైతం వెళ్ళారని గుర్తుచేశారు.ప్రస్తుతం పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం,దోపిడి లేని సమాజం కోసం పోరాటం చేయడమే కాసానికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
అనంతరం నివాళి అర్పిస్తూ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు ఐఎన్టియుసి జిల్లా నాయకులు జలీల్ ఇఫ్టు జిల్లా నాయకులు సంజీవ్ సిపిఎం సీనియర్ నాయకులు కేహెచ్ ప్రసాద్ లు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ కే బ్రహ్మచారి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిలకర పద్మ భూక్య రమేష్ గద్దల శ్రీను నాయకులు కాలంగి హరికృష్ణ ఎమ్మెస్ ప్రకాష్ రమేష్ బాబు జలాల్ బాలకృష్ణ రఘు నసూర్ తదితరులు పాల్గొన్నారు.