కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన

పరివర్తన అవాజ్,కొత్తగూడెం కేంద్రంలోని బీజేపీ–మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కోట్లాది గ్రామీణ పేదల ఉపాధి హక్కులను హరించడానికి ప్రయత్నిస్తోందని నిరసిస్తు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దమ్మపేట గ్రామపంచాయితీలో మండల కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ...