కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం కార్పొరేషన్ 60 డివిజన్ల సమావేశం

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మైనార్టీ నాయకులు సమిష్టిగా పనిచేయాలని...