ఓటు హక్కు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరు సద్వినియోగం పరుచుకోవాలి* : *జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్*
పరివర్తన అవాజ్,కొత్తగూడెం ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా, సద్వినియోగపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులను ఎన్నుకునే అత్యున్నత హక్కు ఓటు హక్కు అని అన్నారు. ప్రజల...