Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 12:55 pm Posted by : laxman RAO

ఉప సర్పంచ్ వడ్డేమ్ సతీష్ కుమార్ ను సన్మానించిన —కనకం సూరిబాబు

పాల్గొన్న ప్రముఖ అంబేద్కర్ వాది వేల్పుల భాస్కర్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో లక్ష్మీదేవి పల్లి సంజయ్ నగర్ గ్రామపంచాయతీ నుండి ఉప సర్పంచ్ గా నియమితులై బాధ్యతలు చేపట్టిన వడ్డేమ్ సతీష్ కుమార్ ను మంగళవారం నాడు ఐ ఎన్ టి యు సి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు పూలదండ శాలువాతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఆ ప్రాంత ప్రజలకు తనకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ అందరి మనసులలో మంచివాడిగా గుర్తింపు పొందిన సతీష్ అన్నను సంజయ్ నగర్ ప్రజలు వార్డ్ మెంబర్ గా గెలిపించి ఉపసర్పంచిగా అవకాశం కల్పించటం ఎంతో సంతోషకరమని, పొంగులేటికి అత్యంత సన్నిహితుడిగా నిస్వార్థ భావజాలంతో కొనసాగుతూ అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పంచే వడ్డేమ్ సతీష్ అన్న రానున్న కాలంలో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ,ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ అంబేద్కర్ వాది వేల్పుల భాస్కర్, ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లంగి శ్రీనివాస్, ప్రముఖ ఆటో డీలర్ కలబోయిన మోహన్, చారి తదితరులు పాల్గొన్నారు.