Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 2:33 pm Posted by : parivarthanaawaaz

సృజనాత్మకతను పెంపొందించేందుకె వైజ్ఞానిక ప్రదర్శనలు

     సృజనాత్మకతను పెంపొందించేందుకె వైజ్ఞానిక ప్రదర్శనలు

                           మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్   పరివర్తన ఆవాజ్04.   జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు గురువారం స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు సైన్స్ ఫెయిర్ కన్వీనర్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఉపాద్యాయ సంఘాల నాయకులు, విద్యారిని విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… ఎంచుకున్నటువంటి థీమ్,సబ్ థీమ్లు అభిరుచులకు తగ్గట్టుగా ఈ కాలానికి, మన దేశాని  అవసరమైనటువంటివిగా ఉన్నాయన్నారు. విద్యార్థులు కేవలం సైన్స్ చదవడం కాకుండా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ఏ ఐ ఆప్స్( Chat GPT, Gemini etc )ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా సరైన సూచనలు ఇచ్చి మనం పొందగలిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని మంచికి ఉపయో గించి తమ జ్ఞానాన్ని పెంపొందించుకొని మంచి భవిష్యత్తు పొందాలని ఆయన సూచించారు. పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని మన పాఠశాల విద్యార్థులందరికీ కోర్స్ మెటీరియల్ పొందే అవకాశం కల్పించిందని తమ వద్ద ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉపాధ్యాయుల సహకారంతో ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వాలా కి సంబంధించిన బోధన వీడియోలు వీక్షించాలని, కాలాన్ని వృధా చెయ్యరాదని, స్మార్ట్ ఫోన్ ను మంచి పనులకు ఉపయోగించాలని ఆయన అన్నారు. సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులని కలెక్టర్ ప్రశసించారు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ మాట్లడుతూ…భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తమ తమ అభిరుచి, ఆసక్తి అనుగుణంగా తమ కోర్స్లు ఎంచుకొని జీవితంలో రాణించా లని విద్యార్థులకు సూచించారు. ఇందుకు గాను ఉన్న సౌకర్యాలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రదర్శన గదులలోని ప్రాజెక్టలని.. కలెక్టర్ ప్రారంభించి వీక్షించారు విద్యార్థులు తయారు చే సిన ప్రాజెక్టులు, పరికరాలను వీక్షించి విద్యార్థులతో మాట్లాడారు ఈ కార్యక్రమం లో సైన్స్ ఫెయిర్ 425 ఇన్స్పైర్ 50 ప్రాజెక్ట్ లను ప్రదర్శించారు