Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 4:57 pm Posted by : parivarthanaawaaz

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యం.పద్మాదేవేందర్ రెడ్డి.

(పరివర్తన)/ ఆవాజ్ న్యూస్. మెదక్  జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్,మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయస్వామి ఆరాధ్య దైవం అన్నారు. అభయాంజనేయ స్వామి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాదే.చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె.జితేందర్ గౌడ్, నాయకులు ఉమామహేశ్వర్, రాజు యాదవ్, దాసు, సుభాష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.