మెదక్ జిల్లాలో వలస కూలీల పిల్లల దుర్భర పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

మెదక్ జిల్లాలో వలస కూలీల పిల్లల దుర్భర పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం (పరివర్తన) ఆవాస్ న్యూస్ మెదక్ జిల్లా,  చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులోని ఎస్‌జి స్నాక్స్ పరిశ్రమ వద్ద బీహార్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీల పిల్లలు అమానుష పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన కూలీలతో పాటు వారి పిల్లలు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. అయితే వారికి కనీస అవసరాలైన వసతి, పరిశుభ్రత, తాగునీరు, విద్య వంటి సౌకర్యాలు...