Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 7:28 am Posted by : manoj punem

పబ్లిక్ మీటింగ్ లకు, ర్యాలీ లకు అనుమతి తీసుకోవాలి: ఇల్లందు డి.యస్.పి. యన్.చంద్రభాను

పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు డిసెంబర్ 10

ఈ రోజు ఇల్లందు పి యస్. పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ పరదిలో ఎలక్షన్ గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా, ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరుగడానికి ప్రజలు కింది మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, గ్రూప్ తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరుగకుండా పోలీసులకు సహకరించాలి.ఎవరు చట్టం ను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటాం.డబ్బు మద్యం బహుమతులు పంపిణీ నిషేధం.ప్రతి ఓటర్ తన ఇష్టమైన అభ్యర్థికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఓటు వేయాలి.ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలు నేరాలు.ప్రచారం నిర్ణయించిన సమయాల్లో మాత్రమే చేయాలి.స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలు అనుమతి ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించాలి.పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు, ప్రచార పదార్థాలు తీసుకెళ్లరాదు.క్యూలో నిలబడి శాంతియుతంగా ఓటు వేయాలి.50000 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు పట్టుకెళ్ళారాదు.ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి గురించి, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే తెలపాలి: డయల్ 100 లేదా ఎల్లందు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.ఎన్నికల ఫలితాల తరువాత సంబరాలు, బాణసంచా, ర్యాలీలు, భారీ సమావేశాలు పోలీస్ అనుమతి లేకుండా నిర్వహించరాదు.ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం.ఇట్టి కార్యక్రమం లో DSP చంద్రభాను గారు , ఎల్లందు SHO సురేష్ గారు, యస్. ఐ. హాసిన గారు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు