Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 8:14 am Posted by : parivarthanaawaaz

సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకి ఆర్టీఐ కమిషనర్ భూపాల్ చేత ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకి ఆర్టీఐ కమిషనర్ భూపాల్ చేత ఘన సన్మానం,

(అవాజ్ న్యూస్): సమాచారం హక్కు చట్టం (RTI) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకు రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ ప్రజలకు సమాచారం అందించే బాధ్యత ప్రతి శాఖాధికారికి ఉందని, ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి పునాది రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన తెలిపారు వీరమల్ల రమశ్రీ మహిళా పారదర్శకతా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించడంలో విశేష కృషి చేశారని అభినందించారు. రమశ్రీ మాట్లాడుతూ ఈ గౌరవం తమకే కాకుండా సమాజంలోని ప్రతి మహిళా కార్యకర్తకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. ఆమె ఆర్టీఐ చట్టం ద్వారా సాధారణ ప్రజలు తమ హక్కులను తెలుసుకుని ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యం అవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కన్వీనర్లు, సామాజిక కార్యకర్తలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.