Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 8:07 am Posted by : Sai Krishna

వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు ముత్యాలంపాడు ZPSS పాఠశాలలోఘనంగా వేడుకలు.

వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు ముత్యాలంపాడు ZPSS పాఠశాలలోఘనంగా వేడుకలు.

టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్

టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్:

 

భారత స్వాతంత్రోద్యమంలో సమరయోధుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో జాతీయ మరియు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ZPSS పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ రామచంద్ర సింగ్ సార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్ అధ్యక్షతన జరిగింది,జిల్లా సీనియర్ నాయకులు దారావత్ ద్రావషింగ్ పాల్గొన్నారు,టేకులపల్లి మండల కన్వీనర్ రవి రాథోడ్ మాట్లాడుతూ దేశం పట్ల విద్యార్థులు దేశభక్తిని చాటాలని, నిరంతరం సమాజం పట్ల, ఉపాధ్యాయుల పట్ల దేశభక్తితో ఉండాలని చెప్పారు, బ్రిటిషర్ల కాలంలో వందేమాతరం అంటే చంపి వేసేవారని, పిల్లలకు చెప్పారు, ఈరోజు మనం స్వచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే, దానికి కారణం ఎంతోమంది దేశం కోసం ప్రాణాలర్పించారు అన్ని విద్యార్థుల కు తెలిప్యారు, ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు దారావత్ ద్రావసింగ్, మండల నాయకులు జర్పలా ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు