మహబూబాబాద్‌లో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం: అందెశ్రీ సాహిత్య సేవలను కొనియాడిన నాగుల్ మీరా

పరివర్తన అవాజ్ :మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం నాడు ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ఉద్యమ నాయకులు ఎస్కే నాగుల్ మీరా పాల్గొని, తెలంగాణ ఉద్యమానికి తన సాహిత్యం ద్వారా స్ఫూర్తినిచ్చిన మహాకవి అందెశ్రీ కి ఘనంగా నివాళులర్పించారు.మహాకవి అందెశ్రీ గారి రచనలు, ముఖ్యంగా రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' ఉద్యమకారులలో శక్తిని నింపాయని, తెలంగాణ చరిత్రలో అందెశ్రీ స్థానం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఉద్యమ...