గోపాలరావు చెరువులో ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ఉచిత చేప పిల్లల పంపిణీ

పరివర్తన అవాజ్ నవంబర్ 14, 2025: ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మండలం, చల్ల సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలరావు చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% రాయితీతో మత్స్యకారులకు ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలను ఎమ్మెల్యే గారు అధికారులు మరియు సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు చెరువులో వదిలారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం మత్స్యకార సంస్థలను అభివృద్ధి పరిచేందుకు వడివడిగా అడుగులు వేస్తుందని తెలిపారు....