Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 3:51 pm Posted by : parivarthanaawaaz

కామారెడ్డిలో ఈ నెల 27, 28న కవిత జాగృతి జనం బాట పర్యటన

కామారెడ్డిలో ఈ నెల 27, 28న కవిత జాగృతి జనం బాట పర్యటన

కామారెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 ,  ఈ నెల 27, 28 తేదీల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. 27న నిజాంసాగర్, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను కవిత స్వయంగా తెలుసుకోనున్నారు. 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుంది. జనం బాట కార్యక్రమాన్ని ప్రజలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా జాగృతి నాయకులు, యూత్ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు