Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లను గెలుచుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారని తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం...