లింగంపల్లిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు

లింగంపల్లిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 27, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి నగర్ స్వయంసేవకుల పథ సంచలన కార్యక్రమం వైభవంగా స్ఫూర్తివంతంగా కన్నులపండుగగా, పాల్గొన్నవారికే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే విధంగా జరిగింది. ముందుగా జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ అచ్చవెల్లి.భాను ప్రకాశ్ తమ వక్త సందేశంలో భాగంగా మాట్లాడుతూ, హిందూ సంఘటన కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించబడింది అన్నారు. సంఘ్ స్వయంసేవకులకు క్రమశిక్షణ, దేశభక్తి...