ముకుందాపురం గౌడ సంఘం నూతన సారథిగా ఐలు యాకయ్య గౌడ్: గౌడ యువత హర్షం
ముకుందాపురం: ముకుందాపురం గౌడ సంఘం అధ్యక్షులుగా ఐలు యాకయ్య గౌడ్ గారు బాధ్యతలు స్వీకరించడం పట్ల గ్రామ గౌడ యువకులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంఘం అభివృద్ధి, గౌడ కుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే నాయకులు యాకయ్య గౌడ్ గారికి గౌడ యువత అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. సుదీర్ఘ అనుభవం, నిబద్ధత, సేవా దృక్పథం కలిగిన యాకయ్య గౌడ్ గారి సారథ్యంలో గౌడ సంఘం మరింత బలోపేతం అవుతుందని యువకులు విశ్వాసం వ్యక్తం చేశారు. గౌడ కుల సంస్కృతి,...