Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 1:14 pm Posted by : parivarthanaawaaz

బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన

బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన,

రైతుల కోసం కొత్త విద్యుత్ లైన్‌కు శ్రీకారం,అంగన్‌వాడీ, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

పరివర్తన అవాజ్ న్యూస్ బయ్యారం /పబ్బు శివ: ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు మంగళవారం బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నూతన విద్యుత్ లైన్ ప్రారంభం:
నామాలపాడు గ్రామ పంచాయతీ ధర్మాపురం గ్రామంలో రైతుల సౌకర్యార్థం 33/11 కెవి నూతన విద్యుత్ లైన్ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు శ్రీకారం చుట్టారు. ఈ లైన్‌ను సుమారు రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన:
మండలంలోని కొత్తపేట, గంధంపల్లి, బాలాజిపేట గ్రామాలలో ఎమ్మెన్నార్ఈజీఎస్ పథకం క్రింద మంజూరైన నూతన అంగన్‌వాడీ భవనాలకు, అలాగే గ్రామ పంచాయతీ భవనానికి కూడా ఎమ్మెల్యే కనకయ్య శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ పథకం కింద బయ్యారం, జగ్గుతండా, వెంకట్రాంపురం గ్రామాలలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన:
ఎమ్మెల్యే కనకయ్య నామాలపాడు, కొత్తపేట, గంధంపల్లి, జగ్గుతండా, బాలాజిపేట, వెంకట్రాంపురం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల చెంతకు స్వయంగా వెళ్లారు. నిర్మాణ పనుల పురోగతిని, బిల్లుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.ఈ పర్యటనలో ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాతగా కోరం కనకయ్య గారు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు , బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయక్, సొసైటీ డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు కొండపల్లి లక్ష్మీ, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు బానోత్ రాము నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నరేందర్, నాయకులు చాపల శ్రీను, బత్తిని రాంమూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.