Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 10:43 am Posted by : parivarthanaawaaz

డయల్ 100 ఫోన్చేయడంతో ప్రాణాలను కాపాడిన హోంగార్డ్

        డయల్ 100 ఫోన్చేయడంతో ప్రాణాలను కాపాడిన హోంగార్డ్

పరివర్తన ఆవాజ్  అక్టోబర్ 11,   హవేలీ ఘనపూర్ మండలం లింగ్సన్ పల్లి గ్రామం జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని గ్రామస్థులు డయల్ 100 సమాచారం రావడం జరిగింది. తక్షణమే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్న హోం గార్డ్ వరప్రసాద్ (లడ్డు),
జైయనంద్, రమేష్ లు గడ్డపార సహాయంతో తలుపులు పగులగొట్టారు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే స్పందించిన వరప్రసాద్ మహిళకు సిపిఆర్ చేసి స్పృహలో వచ్చిన వెంట నేమెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ నరేష్ కూడా ఆసుపత్రికి వెళ్లి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మహిళ ప్రాణాలను కాపాడినందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు వరప్రసాద్, జైయనంద్, రమేష్ను అభినందించారు