జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య…
జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య... వరంగల్ జిల్లా ప్రతినిది అక్టోబర్ 23 (పరివర్తన అవాజ్), వరంగల్ జిల్లా పురావస్తు పరిశోధన, ప్రదర్శనశాలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. అక్కడ ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎంపీ...