Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 1:14 pm Posted by : parivarthanaawaaz

జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా

    జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా

పరివర్తన ఆవాజ్.మహబూబాబాద్, అక్టోబర్.23 జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మరీనా పెయింట్ ప్రైవేటు లిమిటెడ్, కరీంనగర్, కంపెనీలో ఖాళీగా ఉన్న అడ్మిన్ మేనేజర్, అకౌంట్స్, టెలికాలర్, స్టోర్ ఇంచార్జ్, హెచ్.ఆర్.టీమ్, డేటా ఎంట్రీ, లీగల్ టీమ్, ఆఫీస్ సబార్డినెట్ తదితర పోస్టులకు అర్హత కల్గిన 18-35 వయసు గల స్త్రీ,పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు తేది: 25.10.2025 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్ధులు తేది: 25.10.2025 న ఉదయం 10.30 గం. ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు జిల్లా కలెక్టరేట్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జరుగు జాబ్ మేళాకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, రెజ్యూమ్ తో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు.మరిన్ని వివరాలకు జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో సంప్రదించి వివరాలు పొందవచ్చునని అన్నారు.