గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్

పరివర్తన ఆవాజ్  హైదరాబాద్‌, అక్టోబర్ 9:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గన్‌పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆమె, గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అక్రమాలను తీవ్రంగా తప్పుబట్టారు. కవిత మాట్లాడుతూ, "గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ నియామకాలను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలి" అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ...