Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 10:52 am Posted by : parivarthanaawaaz

ఓట్ల చోరిని అరికట్టాలి.

                   ఓట్ల చోరిని అరికట్టాలి.

            ఏ. ఐ. సీ. సీ పిలుపులో భాగంగా పాల్వంచలో సంతకాల సేకరణ

 పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ న్యూస్) అక్టోబర్ 14: దేశంలో ఓట్ల చోరి జరుగుతుందని దానిని అరికట్టాలని,భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించాలంటే ఓటే కీలకమని, అలాంటి ఓట్లు చోరి జరుగుతుందని, అసలైన ఓటర్ ను తొలగించి దొంగ ఓట్లను నమోదు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఏ. ఐ. సీ. సీ నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారం రెండు రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గల పాల్వంచ డివిజన్ లో ఓటర్లకు అవగామన కల్పిస్తూ సంతకాల సేకరణ జరిగింది. పీ. సీ సీ నాయకులు, ఐ. యన్. టీ. యూ. సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలీల్, ఐ. యన్. టీ. యూ. సీ పాల్వంచ పట్టణ అధ్యక్ష్య, కార్యదర్శులు బాణోత్ బాలు నాయక్, శనగ రామచందర్ రావులు సంతకాల సేకరణ చేసారు. ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ ఏ. ఐ. సీ. సీ ఆదేశాలతో తెలంగాణా ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి నిర్ణయం మేరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంతకాల సేకరణలో ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సాహం చూపించి పాల్గొటున్నారని తెలిపారు. లక్షల ఓట్లు తొలగించబడుతున్నాయని, కొన్ని సముదాయాలనం లక్ష్యంగా పెట్టుకొనా వారిని తొలగిస్తున్నారని, డూప్లికేట్ ఓట్స్ ఓటర్ల జాబితాలో దర్శన మిస్తున్నాయని, ఓట్ల దొంగ తనాన్ని అరికట్టి నిజమైన ఓటర్ కు న్యాయం చేయాలని కోరారు. ఓట్ చోరి సంతకాల సేకరణ కార్యక్రమం.ఎలక్షన్ కమీషన్ ఓట్లు చోరి జరగకుండా, అసలైన ఓటర్లును గుర్తించి, ఓటర్ల లీస్టులో తప్పులు దొర్లకుండా, పారదర్శికంగా,సమర్దవంతంగా నిర్వహించాలని విజ్జప్తి చేసారు. దొంగ ఓట్లు వేయడం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని, వీటిని అరికట్టాలని కోరారు. సంతకాల సేకరణ కాపీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లి కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్యకు అందచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రేస్ పార్టి నాయకులు బాణోత్ రాము నాయక్,లాలు నాయక్, శంకర్ నాయక్, సక్రు నాయక్,కిషోర్ నాయక్, కుమర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు