Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 4:12 am Posted by : parivarthanaawaaz

ఆర్టిఏ చెక్పోస్టులో ఏసీబీ సోదాలు

            ఆర్టిఏ చెక్పోస్టులో ఏసీబీ సోదాలు

    ఎం వి ఐ కిరణ్ కుమార్ ను అదుపులో తీసుకున్న ఏసిపి అధికారులు

పరివర్తన అవాజ్ సంగారెడ్డి,    సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టిఏ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగించారు. విధుల్లో ఉన్న ఎంవీఐ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని లెక్కల్లో చూపని 43 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ చార్టులు ఏర్పాటు చేసుకొని ఎంవీఐలు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమంగా రూపొందించిన డ్యూటీ చార్టులను సీజ్ చేశారు. ఏసిబి అధికారులకు పట్టుబడిన ఎంవీఐ కిరణ్ కుమార్ తన డ్రైవర్ తో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోదాల్లో వెలుగు చూసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.