Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 1:21 pm Posted by : parivarthanaawaaz

అవినీతి రహిత పాలన ఏర్పాటే తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ లక్ష్యం

అవినీతి రహిత పాలన ఏర్పాటే తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ లక్ష్యం

ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ జిలకరి రవికుమార్

మెదక్  పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 22,    మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహంలో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అనేక అంశాల మీద వెనుకబడి ఉన్న తెలంగాణ గ్రామాల వారిగా అభివృద్ధి చెందాడానికి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 2000 సంవత్సరంలో ఆవిర్భవించిందన్నారు. కేంద్రంలో ఓ పార్టీ రాష్ట్రంలో ఓ పార్టీ ఉన్న స్థానిక అభివృద్ధి జరగకపోవడం తో ప్రజలను చైతన్యవంతం చేయడానికి టిపిఆర్పి కంకణ బద్దులమవుతున్నామన్నారు. సంస్థాగత ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించి అవినీతి రహిత పాలన కొనసాగించడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దాసరి శ్యామ్ రావు, సీనియర్ నాయకులు రిటైర్డ్ ఐఐఎస్ కునమనేని హరిప్రసాద్, డాక్టర్ సింగం శ్రీనివాస్ రావు, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు ఉదయ కుమారి, విజయా రెడ్డి, ప్రొఫెసర్ సయ్యద్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.