Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 5:41 am Posted by : parivarthanaawaaz

అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ

 అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ,

పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22:    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు గురువారం (అక్టోబర్ 23) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై చర్చించి, స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేస్తే హైకోర్టులోనే తేల్చుకోమనడంతో తదుపరి న్యాయపరమైన చర్యలు, ప్రత్యామ్నాయాలు, పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనున్నది.ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించిన వివరాలను కేబినెట్‌కు సమర్పించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై పూర్తి స్థాయి న్యాయపరమైన స్పష్టత వచ్చేవరకు ఎన్నికలను వాయిదా వేయాలా? అనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగే చాన్స్ ఉన్నది…