సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు,
శేరీలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 21, మియాపూర్ పోలీస్ నిఘా బృందం సెల్ ఫోన్ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దోపిడి సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అరెస్టయిన నిందితుల వివరాల శాలిబండకు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అయాజ్ వృత్తి: ఆటో డ్రైవర్, కాలపత్తర్ కు చెందిన రెండవ నిందితుడు మీర్జా ఫరూక్ బైగ్,వృత్తి: పండ్ల వ్యాపారి, బహుదూర్ పురకు చెందీన మూడవ నిందితుడు సయ్యద్ సాజిద్,వృత్తి: ఆటో డ్రైవర్, పహాడీషరీఫ్ కు చెందిన నాలుగవ నిందితుడు మొహద్ అమీర్, వృత్తి: ఆటో డ్రైవర్,తలాబ్ కట్టకు చెందిన అయిదవ నిందితుడు సయ్యద్ ఒమర్,వృత్తి పుస్తకాల వ్యాపారి, ఫలక్ నుమా కు చెందిన ఆరవ నిందితుడు అబ్దుల్ నవీద్, వృత్తి: ఫోన్ల వ్యాపారం ఈ ఆరుగురు నిందితుల్లో మొదటి నుండి ఏ 4 నిందితుల వరకు చోరీ చేసిన సొత్తును తీసుకొనివచ్చి ఏ 5 కి ఇచ్చి అతని ద్వారా ఏ6 అయిన అబ్దులు నవీద్ కు ఇచ్చి అమ్మేవారని అన్నారు అసలు విషయం వెలుగులోకి ఎలా వచ్చిందంటే ఈ నెల పద్దెనిమిది నాడు మియాపూర్ విలేజ్ కు చెందిన వ్యక్తి తన ఇంటికి వెళ్ళటానికి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తుండగా, మియాపూర్ విలేజ్ కి వెళ్ళాలి అని చెప్పగా, ఆటో అతను అతన్ని సమీపించి, పక్కన ఆటో ఆగిందని, అందులోని ప్రయాణీకులు కూడా మియాపూర్ విలేజ్ కే వెళ్తున్నారని చెప్పి, వాహనం ఎక్కమనగా అతను ఆటో ఎక్కానాని ఫిర్యాదులో పేర్కొన్నాడని అప్పటికే ఆటోలో ముగ్గురు నిందితులు (నిందితులు ఏ -2 నుండి ఏ -4 వరకు) కూర్చుని ఉన్నారని ఫిర్యాదుదారుడు తన గమ్యస్థానానికి అత్యవసరంగా చేరుకోవాల్సినందున, ఆటో ఎక్కాడు. కొంత దూరం ప్రయాణించిన తరువాత, ప్రయాణీకుల అవతారంలో ఉన్న నిందితులు అతనిపై దాడి చేసి, బలవంతంగా అతని మొబైల్ ఫోన్, లాక్కుని, వాహనం నుండి బయటకు తోసేశారని, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల నేర చరిత్ర వివరిస్తూనిందితులు ఏ -1 నుండి ఏ -4 వరకు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకి చెందినవారు మరియు సన్నిహిత సహచరులు. వారికి పాత నేర చరిత్ర ఉందని రెండు కమిషనరేట్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ లలో ఒక్కొక్కరిపై గతం నుండి నేటి వరకు మూడు పదుల సంఖ్యల్లో కేసులు కూడా ఉన్నాయని ఐదవ నిందితుడిపై ఒక కేసు. ఆరవ నిందితుడిపై ఇదే మొదటి కేసు అని తెలిపారు,సులభంగాఅధిక మొత్తంలో డబ్బు సంపాదించాలానే ఆశతో మొదటి నిందితుడు మహ్మద్ ఐజాజ్, రెండు కమిషనరేట్ పరిమితుల్లోని వివిధ బస్ స్టాప్ల వద్ద ఆటో కోసం వేచి ఉన్న ప్రయాణికుల నుండి మొబైల్ ఫోన్లను దోచుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు.
వారి ప్రణాళిక ప్రకారం, ఏ -3 నిందితుడు వజీద్ అనే వ్యక్తి నుండి ఆటోను సేకరించి నేరాలకు పాల్పడటం ప్రారంభించాడు. ఇందులో ఏ-1 ఆటోను నడుపుతాడు, ఏ-2 నుండి ఏ-4 వరకు ప్రయాణికులుగా నటిస్తారు. ఎప్పుడైతే ఒక ప్రయాణికుడు వారి ఆటోలో ఎక్కుతాడో, వారు అతన్ని కొద్ది దూరం తీసుకువెళ్లి, బలవంతంగా అతని మొబైల్ ఫోన్ మరియు విలువైన వస్తువులను లాక్కుని ఆటోలోనుండి బయటకు నెట్టి, అక్కడి నుండి పారిపోతారు.దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను ఏ -5 నిందితుడు సయ్యద్ ఓమర్‌కు అప్పగించేవారు, అతను వాటిని హైదరాబాద్, అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్లో ఏ-6 అబ్దుల్ నవీద్ ద్వారా విక్రయించేవాడని ఈ ముఠా ఏప్రిల్, 2025 నుండి ఇటువంటి నేరాలకు పాల్పడుతోంది, ఇప్పటివరకు అమాయకులైన షేర్డ్ ఆటో ప్రయాణికుల నుండి 700 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లను దోచుకున్నట్లు అనుమానిస్తున్నారూ నిందితుల అరెస్ట్ చేసి వారి వద్ద 20 మొబైల్ ఫోన్లు,ఒక ఆటోరిక్షా,ఒక హోండా యాక్టివా,2,50,000/-రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు
ఈ కేసును విజయవంతంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడానికి మియాపూర్ పోలీస్ క్రైమ్ సిబ్బందితోపాటు అడిషనల్ డీసీపీ రీతి రాజ్ ఐపీఎస్,. డి.సి.పి ఉదయ్ రెడ్డి, మరియు ఏ.సి.పి సిహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, మియాపూర్ డివిజన్, మాదాపూర్ జోన్, సైబరాబాద్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిందని కేసును ఛేదించడంలో మరియు నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన మియాపూర్ పోలీస్ సిబ్బంది వారి ప్రశంసనీయమైన కృషికి తగిన విధంగా సత్కరించడం జరుగుతుందని పి. శివ ప్రసాద్, ఎస్.హెచ్.ఓ,జి. రమేష్ నాయుడు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్,బి. నరసింహ రెడ్డి, డి.ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ డి. చంద్ర శేఖర్,హెడ్ కానిస్టేబుల్ ఎన్. ప్రేమ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్. యెడయ్య, కానిస్టేబుల్లు
ఎ. సుభాష్ చంద్ర బోస్, ఇ. మల్లికార్జున్,ఎన్. పూర్ణ చందర్, లను అభినందించారునెంబర్లు లేని వాహనాలను ఎక్కకూడదు అని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఏసీపీ శ్రీనివాస్ కుమార్
రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేని షేర్డ్ ఆటోలలో లేదా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది తెలియని ప్రయాణికులు ఉన్న ఆటోలలో ఎక్కవద్దని ప్రజలకు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు . ఆటో ఎక్కే ముందు రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పకుండా గమనించాలని మరియు ఏదైనా అనుమానాస్పద చర్య కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100 కు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు*


