సీసీఐ కొనుగోలు సెంటర్ లను సద్వినియోగం చేసుకోండి
రైతులు మద్దతు ధర పొందండి కలెక్టర్ రాహుల్ రాజ్
పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని.. మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.టేక్మాల్ మండలంలోని బర్దిపూర్ లో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్బంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 25939 మంది రైతులు 34903 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని. అంచనా వేశారన్నారు.
జిల్లా లో సిద్ధార్థ జిన్నింగ్ మిల్ పాపన్నపేట్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పత్తి ధరలు పింజరకం బీబీ మోడ్ 8110, గా పింజరకము బిబి స్పెషల్ 8060 గా, పింజరకము ఎం ఇ సి హెచ్ 8010 గా ఉన్నాయన్నారు ఇందుకు సంబందించి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు పత్తి కొనుగోలు కేంద్రాలను మనటరింగ్ చేసేందుకు… AMC లాల వారీగా లోకల్ కమిటీ లను నియమించి..ఎప్పటికప్పుడు రైతులు మద్దతు ధర పొందెల కృషి చేయాలన్నారు లీగల్ మెట్రాలాజి అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలన్నారు సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జీన్నింగ్ మిల్లు యాజమాన్యం తగు జాగ్రత్త లు తీసుకోవాలన్నారు ఏ
చిన్న ప్రమాదం జరగకుండా అగ్ని మాపాక శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారూ.

