సర్కిల్ 21 ప్రజావాణిలో మొత్తం 20 పిర్యాధులు
శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 27 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలని పరిష్కరించడానికి ప్రతి సోమావారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారంనాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో సర్కిల్ 21 డిప్యూటీ కమీషనర్ డి శశి రేఖ, ఏసీపీ నాగిరెడ్డి ,ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి,ఇంజనీరింగ్ విభాగం అధికారిణి శ్రీదేవి,ఎంటోమాలజీ విభాగం అధికారి చిన్న,యుబిడి విభాగం అధికారిణి సమీర , ఎలక్ట్రికల్ సెక్షన్ లక్ష్మి ప్రియా, ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ మాట్లాడుతూ ఈ కార్యక్రమం లో నేడు మొత్తం 20 ఫీర్యాదులు వచ్చాయని వచ్చినా వాటిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలపై 7 ఫీర్యాదులు వచ్చాయి రెవెన్యూ లో 5 పిర్యాదులు ఇంజనీరింగ్ విభాగం లో 3 ఫీర్యాదులు సానిటేషన్ లో 2 ఫీర్యాదులు యుబిడి లో 2 ఫీర్యాదులు ఎలక్ట్రికల్ సెక్షన్ లో 1 ఫీర్యాదులు. మొత్తం 20 ఫీర్యాదులు వచ్చాయని వచ్చిన ఫీర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు, ఆదేశించినట్లు డిప్యూటీ కమిషనర్ శశిరేఖా తెలిపారు

