శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం .
పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి.
మెదక్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 21, మెదక్ పట్టణంలోని ద్వారకా నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులు సభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రభు రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ కౌన్సిలర్ సులోచన ప్రభు రెడ్డి,ఆరేళ్ల గాయత్రి, విశ్వం, భీమరి. కిషోర్, ఆర్కే. శ్రీనివాస్, మాయ.మల్లేశం, నాయకులు లింగా రెడ్డి,జుబెర్ అహ్మద్,కిష్టయ్య, సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి, మార్గం. ఆంజనేయులు,యామి రెడ్డి, మేకల. సాయిలు,స్వామి నాయక్, రంజిత్,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

