శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 11
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 గురు విదేశీయులను అరెస్ట్ చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరి ధిలోని న్యూ హఫీస్ పెట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టూ చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయ గా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశం లోని మొన్రోవియా సిటీ కి చెందిన డేరియస్ (28) 2021 సంవత్సరంలో విద్యాభ్యాసం నిమిత్తం భారతదేశానికి వచ్చి మియాపూర్, సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతనితోపాటు కెన్య దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఉగాండా దేశానికి చెందిన ఇద్దరు మహిళలతో కలిసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. డేరియస్ తో పాటు నలుగురు విదేశీ మహిళలను అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుండి 4 వేల రూపాయల నగదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోం కు తరలించగా డేరియస్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు
