వైష్ణవ జన తో’ తెలుగు వెర్షన్ను ‘గాంధీ మార్గం’ ను నాటక రూపంలో ప్రదర్శించిన సీబీసీ
స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ‘గాంధీ మార్గం’ కార్యక్రమాన్ని నిర్వహించిన సీబీసీ
హైదరాబాద్ (పరివర్తన ఆవాజ్) . స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం, వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), తిరుమలగిరి లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సహకారంతో బుధవారం రోజున గాంధీ మార్గం అనే కార్యక్రమం ద్వారా ‘వైష్ణవ జన తో’ భజనను నాటక రూపంలో ప్రదర్శించింది. ప్రదర్శన అనంతరం పెద్దఎత్తున విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. మహాత్మాగాంధీ ఆశయ స్ఫూర్తితో విలువలతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించటం దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో సీబీసీ సీనియర్ అకౌంట్స్ అధికారిణి మంగళ, ఇతర అధికారులు మరియు సిబ్బందితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5, 2026 వరకు హైదరాబాద్లోని వివిధ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలను సీబీసీ నిర్వహించనుంది.


