వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిల్లూరి వివేకానంద రెడ్డి ఇకలేరు.
కడసారి చూసేందుకు పోటెత్తిన ఆత్మీయులు..
పార్టీలకతీతంగా తరలివచ్చి పార్టీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కన్నీటి పర్యంతమైన సహచరులు..
అన్నమయ్య జిల్లా, జనవరి 20 (పరివర్తన అవాజ్) ~మదనపల్లి -:- తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన బిల్లూరివారిపల్లి గ్రామానికి చెందిన ప్రజా సేవకుడు, నిస్వార్థ పరుడు, మంచికి మారు పేరుగల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములకలచెరువు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి బిల్లూరి వివేకానంద రెడ్డి (75) అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాఘమాసం ప్రారంభ దినం పరమశివుడికి ప్రీతికరమైన సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బిల్లూరి వివేకానంద రెడ్డి ఇకలేరని తెలుసుకున్న తంబళ్లపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పలు మాధ్యమాలలో మంచికి మారుపేరైన వివేకానంద రెడ్డి శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెట్టి పెద్దాయనను కోల్పోయామంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆప్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన రాక కోసం గ్రామస్తులంతా ఎదురు చూశారు. గత కొద్ది రోజులకు ముందు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నేరుగా వారి స్వగృహానికి విచ్చేసి వివేకానంద రెడ్డిని పరామర్శించి ధైర్యంగా ఉండమని మీకు మేమున్నామంటూ భరోసా కల్పించిన విషయం తెలిసిందే. మంచి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆయన మాటిచ్చినట్టుగానే బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైద్యం సహకరించక సోమవారం శాశ్వత తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వివేకానంద రెడ్డి సుమారు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ గ్రామాల్లో పెద్దాయనగా పేరు పొందారు. తొలినాళ్ళలో కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందారు. దివంగత నేత స్వర్గీయ తంబళ్లపల్లి మాజీ శాసనసభ్యులు కలిచర్ల ప్రభాకర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణాంతరం కుటుంబ సభ్యులంతా తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వెంట అడుగులు వేశారు. ఆయన గెలుపుకు ఎంతగానో కృషి చేశారు. ద్వారకానాథ్ రెడ్డి కుటుంబంలో ఒకరిగా చెరిపోయారు. గ్రామాల్లోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి వచ్చిన వాళ్లకు తక్షణమే పరిష్కారం చేసి చూపెడుతూ ప్రజల మన్నెలను పొందారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వ్యక్తి ఇక లేరని గ్రామస్తులు తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ సేవ చేశారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వెంట నడిచే వ్యక్తిగా ముద్రపడ్డారు. వివేకానంద రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు విద్యాసాగర్ రెడ్డి సాఫ్ట్ వేర్ గా స్థిరపడితే రెండవ అతను బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తూ ములకల చెరువు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు పార్టీలక తీతంగా ఏవి లక్ష్మి దేవమ్మ, చల్లపల్లి నరసింహారెడ్డి, ములకలచెరువు మండల కన్వీనర్ కోటిరెడ్డి మాధవరెడ్డి, జడ్పీటీసీ మోహన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఆర్ సీడీయస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గూడుపల్లి జయసింహారెడ్డి, మంత్రి ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రెసిడెంట్ హైదర్ వల్లి, ఘోరా సోదరులు వెంకట్రామిరెడ్డి, రవీంద్రా రెడ్డి, దిన్నే పాటి రవీందర్ రెడ్డి, బూత్ గౌరీ శంకర్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, బూత్ కమిటీ చైర్మన్ బోనాల చాంద్ భాష, ఎంపీటీసీ కృష్ణప్ప, యువ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ షంషాద్, బిల్లూరి సోదరులు, కుటుంబ సభ్యులు, సిపిఐ మండల అధ్యక్షుడు అంజన్నప్ప, దుగసానిపల్లి విశ్వనాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, బిల్లూరివారిపల్లి గ్రామానికి తరలివచ్చి కడసారి ఆత్మీయ నాయకుడు, సహచరుడిని చూసి వాళ్లు కూడా కంటతడి పెట్టారు. అభిమాన నాయకుడు ఇక లేరని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నిష్క్రమణ ఘాటు వద్దకు వెళ్లి కడసారి వీడ్కోలు పలికారు..

