రోడ్డుపై మురికి నీరు పట్టించుకోని మున్సిపల్ అధికారులు
{పరివార్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా} : కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని13 వ వార్డు టేక్రియల్ గ్రామంలో వినాయక నగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ వన్ లోని రోడ్డు పై మురికి నీరు ఉండటం వల్ల ఆ కాలనీ వాసులకు వాసన కు ఇబ్బందికి గురవుతున్నారు.మున్సిపాల్ అధికారులకు ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరని ఆ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వెళ్తున్నారాని ఆ కాలనీవాసులు తెలిపారు. రోడ్డుపై మురికి నీరు ఉండటంవల్ల వాహనాలకు, బైక్ లకు చాలా ఇబ్బంది అవుతుందని ఆ కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపాల్ అధికారులు పట్టించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే
