రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లోనే ధాన్యాన్ని విక్రయించలిబుధవారం కౌడిపల్లి మండల వెల్మ కన్నె గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రంన్నీ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో దాదాపు 100 కేంద్రాల్లో దాన్యం రావడం మొదలైంది అన్నారు.కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని తెలిపారు.టోకెన్ అందించడంతోపాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు.ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.రామాయంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవాణా అవుతుందని తెలిపారు.రైతులు దళారులను నమ్మి రైతులు మోస పోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లోనే ధాన్యాన్ని విక్రయించాలని వెల్లడించారు.,మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన గుణాత్మక విద్యకు సోపానాలని, . ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్యద్వారా అభివృద్ధి పథంలోకి రావాలని దానికి ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని, కావున విద్యార్థులకు లెక్కలు మరియు ఆంగ్లం మీద పట్టు సాధించే విధంగా తర్ఫీది ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులతో 30 నిమిషాల సేపు పాఠ్యాంశాలపై వివిధ ప్రశ్నలు అడగడం వారితో ముచ్చటించడం జరిగింది. ఉపాధ్యాయిని పదినిమిషాలు పాఠం చెప్పించి తర్వాత ఆమెను అభినందించారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు, బాలింతలకుఅంగన్వాడీ కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని, చిన్నారుల సామర్ధ్యాలను పరిశీలించారు.అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, గ్రామంలో ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని . అవి ఏ ఏ దశలల్లో ఉన్నాయని తెలుసుకున్నారు.ఇప్పటి వరకు అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్ కి డబ్బులు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు అన్ని బిల్లులు వచ్చాయా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

