రామాయంపేటలో రెండో రోజు 51 నామినేషన్లు దాఖలు
స్పెషల్ అధికారి సాయిబాబా
(పరివర్తన ఆవాజ్ ) మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉత్సాహంగా సాగింది. గురువారం ఒక్కరోజే వివిధ పార్టీల నుంచి,51 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి సాయిబాబా ప్రకటించారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతు దారులతో భారీగా తరలి రావడంతో మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో రాజకీయ సందడి నెలకొంది.పార్టీల వారీగా వివరాలను వెల్లడిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి 24, బీఆర్ఎస్ (BRS) నుంచి 13, బీజేపీ (BJP) నుంచి 10 నామినేషన్లు అందగా,మరో నలుగురు స్వతంత్రులు (ఇండిపెండెంట్లు) తమ నామినేషన్ పత్రాలను సమర్పించారని సాయిబాబా తెలిపారు. పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్లు వేయడానికి గడువు సమీపిస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా సాగుతోందని స్పెషల్ అధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.మున్సిపాలిటీలోని కాంగ్రెస్ తరపున భార్యా భర్తలు ఒకటో వార్డు అభ్యర్థిగా గజవాడ లావణ్య ఏడో వార్డు ఆమె భర్త గజవాడ నాగరాజు తమ నామినేషన్ పత్రాలు అధికారికి సమర్పించారు ఒకే ఇంట్లో ఇద్దరు ఎన్నికల బరిలో నిలవడం తో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

