రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి
తొలిరోజు 7 నామినేషన్లు
(పరివర్తన అవాజ్ ) మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా రామాయంపేట పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైన బుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 7 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్ (TRS) పార్టీ నుండి ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు నామినేషన్ వేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ ఆఫీసర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

