రాజకీయ ఎదుగుదలతోనే సామాజిక గుర్తింపు
వైశ్యులకు రాజకీయ చైతన్యం అవసరం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్
{ కామారెడ్డి పరివర్తన ఆవాజ్} కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో రాజకీయ పదవులను పొందిన ఆర్యవైశ్యులను సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ ఎదుగుదలతోనే వైశ్యులకు సామాజిక గుర్తింపు లభిస్తుందని,ఐక్యమత్యంగా ముందుకు కదిలినప్పుడే వైశ్య సమాజానికి రాజకీయ గుర్తింపు ఏర్పడుతుందని అన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియామకమైన గంప ప్రసాద్, పాత దివ్య,వలిపిశెట్టి భాస్కర్ లను సన్మానించడం జరిగింది. పదవులను పొందడం గొప్పదనం కాదని ఆ పదవికి తగిన న్యాయం చేయాలని వైశ్య సమాజంతో పాటు సామాజిక సేవలో భాగస్వాములుగా నిలిచి గుర్తింపును పొందాలని సూచించారు.ఆలయంలో ఐవిఎఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఉపాధ్యక్షులు కొత్త బీమ్ రాజ్, మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుక్క రజని, చిలువేరి శ్రీదేవి,ఉపాధ్యక్షులు కస్వ లలిత దొంతి,అర్చన జిల్లా,మురికి సౌమ్య,ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్,ప్రధాన కార్యదర్శి ఎర్రం విజయ్ కుమార్,కోశాధికారి నంగు గునూరి కాశీనాథం,సలహాదారులు రాజూరి మనోహర్,జిల్లా పిఆర్వో కొత్త సంఘరాజు,దోమకొండ శ్రీనివాస్,మురికి సంపత్ లు పాల్గొనడం జరిగింది.

