మనోహరాబాద్ ITC గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ 18 లక్షల దొంగసొత్తు స్వాధీనం
గత సెప్టెంబర్ నెలలో, మనోహరాబాద్ ITC గోదాం లో పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సుల దొంగతనం చేసిన కేసులో, ఈ రోజు మనోహరాబాద్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి , వారి నుండి చోరీ కి గురి కాబడిన మొత్తం పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులను, రూ.8 లక్షల నగదును మరియు చోరీకి వాడిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మైదరబోయిన శ్రీకాంత్,
చెట్టి మహేశ్ ఇద్దరు స్నేహితులు కొన్నిసంవత్సరాలుగా ఐ టి సి గోదాంలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు వారిద్దరూ దుర్విషనాలకు అలవాటు పడి వాహనాల ఫైనాన్సు బకాయిలు ఇంటి అప్పు తదితర కార్యాలయం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానితో వారు ఐటిసి గోదాములో లోడ్ అవుతున్న సిగరెట్ బాసులను దొంగిలించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు వారంతా ఎల్లోవింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కి చెందిన సిగరెట్లు ఉన్న వాహనాలను చార్జింగ్ కోసమని పార్కింగ్ దగ్గర పెట్టడాన్ని అదేవిధంగా ఐటీసీ గోదాంలో ఉన్న భద్రత లోపాలను గమనించి తమ దొంగతనాన్ని అనుకూలంగా ఉందని భావించి అవకాశం కోసం ఎదురుచూసి మొదటిసారి 08.12.2024
నాడు అర్ధరాత్రి గోడ దూకి ఐటిసి గోదాంలోకి ప్రవేశించి ఛార్జింగ్ పాయింట్ లో సిగరెట్ లోడుతో ఉన్న టాటా ఏసీ వాహనం తాళంను బలగాలగొట్టి 8.30.000/విలువైన సిగరెట్లను దొంగతనం చేశారు వాటిని బయటికి మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్నారు తిరిగి అదే తరహాలో 18.05.2025 నాడు 15 లక్షల విలువైన సిగరెట్లను దొంగతనం చేశారు చివరగా 21.09.2025 నాడు మరోసారి చోరీకి పాల్పడి సుమారు 10 లక్షల విలువైన సిగరెట్లు దొంగతనానికి పాల్పడినారు ఈ మూడు దొంగతనాలలో సుమారు 33 లక్షల విలువైన రూపాయల విలువ గల సి రేట్లు బాసులను దొంగిలించి వాటిని చెట్టి మహేష్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి వీలు చూసుకుని రిటైల్ వ్యాపారస్తులకు అమ్మేసేవారు
పై ఇద్దరు నిందితులు గత కొన్ని సంవత్సరాలుగా ITC గోదాం, జీడిపల్లి లో డ్రైవర్లుగా పనిచేస్తూ ఒకరితో ఒకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ దుర్వ్యసనాలకు అలవాటు పడి, వాహనాల ఫైనాన్స్ బకాయిలు, ఇంటి అప్పులు తదితర కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానితో వారు ITC గోదాములో లోడవుతున్న సిగరెట్ బాక్సులను దొంగిలించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. వారాంతంలో Yellow Wing Transport Company కి చెందిన సిగరెట్ లోడ్ తో ఉన్న వాహనాలు ఛార్జింగ్ కోసమని పార్కింగ్ దగ్గర పెట్టడాన్ని, అదేవిధంగా ITC గోదాములో ఉన్న భద్రతా లోపాలను గమనించి, తమ దొంగతనానికి అనుకూలంగా ఉందని భావించి అవకాశం కోసం ఎదురు చూసి, మొదటి సారిగా తేది 08.12.2024 నాడు అర్ధరాత్రి గోడ దూకి ITC గోదాములోకి ప్రవేశించి , ఛార్జింగ్ పాయింట్ లో సిగరెట్ లోడ్ తో ఉన్న TATA ACE (EV) వాహనం తాళాలను పగలగొట్టి రూ.8,30,000/- విలువైన సిగరెట్లు దొంగతనం చేశారు. వాటిని బయటి మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకున్నారు. తిరిగి అదే తరహాలో తేదీ 18.05.2025 నాడు రూ.15 లక్షల విలువైన సిగరెట్లు దొంగతనం చేశారు.
చివరగా తేదీ 21.09.2025 నాడు మరోసారి చోరీకి పాల్పడి సుమారు రూ.10 లక్షల విలువైన సిగరెట్లు దొంగతనానికి పాల్పడినారు. ఈ మూడు దొంగతనాలలో సుమారు 33 లక్షల విలువైన రూపాయల విలువగల సిగరెట్ బాక్సులను దొంగిలించి వాటిని చెట్టి మహేష్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి, తర్వాత వీలు చూసుకోని, తప్పుడు వివరాలు చెప్పి రిటైల్ వ్యాపారస్తులకు అమ్మివేసినారు. రెండు సార్లు కలిపి సుమారు రూ.18,64,000/- రూపాయలు సంపాదించి వాటిని సమానంగా పంచుకున్నారు. అయితే మూడవసారి చేసిన చోరీ చేసిన సిగరేట్లను అమ్మడానికి సరి అయిన వ్యక్తి కోసం ఎదురు చూస్తునారు, అందులో భాగంగా 11.10.2025 నాడు నిందితులు తాము దొంగిలించిన సిగరెట్ ప్యాకెట్లను (మొత్తం 9 సంచులు- 8,500 ప్యాకెట్లు – American Club & Gold Flake బ్రాండ్లు) TATA INTRA Goods Vehicle (నంబర్: TS35TA4437) లో అమ్మకానికి తరలిస్తుండగా, మనోహరాబాద్ , జీడిపల్లి వద్ద , బి. సుభాష్ గౌడ్ (ఎస్.ఐ మనోహరాబాద్ పోలీస్ స్టేషన్) ఆధ్వర్యంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో వాహనాన్ని ఆపి పరిశీలించగా సిగరెట్ ప్యాకెట్లలోడును గమనించి వాటి యొక్క ఇన్వాయిస్ పత్రాలు చూపించమని అడగగా, నిందితులు సరైన వివరాలు చెప్పకపోవడంతో , వారిని అడుపులోనికి తీసుకొని విచారించంగా , తాము చేసిన నేరాలను ఒప్పుకోవడంతో పట్టు , నేరాలకు ఉపయోగించిన వాహనాల వివరాలు, తమ అవసరాలకు ఖర్చు చేయగా మిగిలిన దొంగ సొత్తు వివరాలను చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల పై ఉన్న కేసుల వివరాలు :
1) Cr.No.1024/2024 of Chaitanyapuri Police Station
2) Cr.No.155/2025 of Manoharabad Police Station
3) Cr.No,271/2025 of Manoharabad Police Station
పై కేసులతో పాటు A2- చెట్టి మహేష్ గతంలో తూప్రాన్ లో జరిగిన దొంగతనం కేసులో కూడా నిందితుడు
(Cr.No. 76/2013 of Toopran PS)
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
1. TATA INTRA Goods Vehicle (TS35TA4437)
2. Ashok Leyland vehicle (TS35TA1780)
3. Mahindra MAX PUP BOX (TG35T1794)
4. మొత్తం 9 సంచులు 8,500 సిగరెట్ ప్యాకెట్లు (American Club & Gold Flake బ్రాండ్లు) మొత్తం విలువ సుమారు రూ.10,00,000/- (పది లక్షలు).
పూర్వపు దొంగతనాల కు సంబంధించిన Rs.8,00,000/- నగదు.
వరసగా ITC గోదాములో జరగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో, ఈ కేసు వెలికితీతలో శ్రీ. జె.నరేందర్ గౌడ్ (DSP తూప్రాన్ డివిజన్) గారి పర్యవేక్షణలో, శ్రీ. రంగ కృష్ణ (తూప్రాన్ సిఐ) గారు, శ్రీ. బి. సుభాష్ గౌడ్ (ఎస్.ఐ మనోహరాబాద్ పోలీస్ స్టేషన్) గారు మరియు ఆయన సిబ్బంది గోవర్ధన్ రావు-HC మరియు పిసీలు రాధాకృష్ణ, బిక్షపతి, నరేందర్ గౌడ్, సురేశ్ గార్లు సమర్ధవంతంగా పనిచేసి దొంగలను అరెస్టు చేయడం
జరిగిందని ఎస్పీ తెలిపారు
